కాలిపోయిన టీవీ, ల్యాప్ టాప్
తెలంగాణఅక్షరం-వీణవంక
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో మంటలు వ్యాపించి టీవీ, ల్యాప్ టాప్ దగ్ధమయ్యాయి. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామంచ లక్ష్మయ్య-రాజమ్మ దంపతుల కుమారులు, కూతురు-అల్లుళ్లు క్రిస్మస్ సందర్భంగా గ్రామానికి వచ్చారు. కాగా పండగ సంబరాల్లో ఉండగా వారి యొక్క ఇంట్లో కాలక్షేపానికి టీవీ చూస్తుండగా ఒకేసారి షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో వారు భయంతో బయటకి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఇంటి చుట్టుపక్కల వారు ఘటనాస్థలానికి చేరుకుని నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. ఈఘటనలో టీవీ, ల్యాప్ టాప్, సోపా సెట్లు, ఇతర సామాగ్రి కాలిపోయినట్లు బాధితులు వాపోయారు. కాగా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాదితులు కోరుతున్నారు.