-
బీజాపూర్ లో పోలీస్, నక్సలైట్ ల ఎదురుకాల్పులు
తెలంగాణఅక్షరం-బీజాపూర్
బీజాపూర్ లో పోలీసులు నక్సలైట్లకు తీవ్ర ఎన్కౌంటర్ జరిగింది స్థానికుల కథనం ప్రకారం..ఈ ఎదురు కాల్పుల్లో ఆరు నెలల పసికందు మృతి చెందింది. బాలిక తల్లి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు గాయపడ్డారు. బాధిత కుటుంబానికి సహాయం చేసేందుకు ఏఎస్పీ పోలీసు బలగాలతో అధికారులు అక్కడికి వచ్చారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌లో భైరం ఘడ్ ఏరియా కమిటీ సెక్రటరీ చంద్రన్న, మరికొందరు నక్సలైట్లకు గాయాలు కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి.
Please follow and like us: