తెలంగాణ అక్షరం-హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జను నియమించింది. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పని చేసిన స్మిత సబర్వాల్‌ను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలిగా పోస్టింగ్ ఇచ్చారు.
అధికారుల కొత్త పోస్టింగ్:
ఇరిగేషన్ కార్యదర్శి: రాహుల్ బొజ్జా
స్విత సబర్వాల్: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్
దాసరి హరిచందన: నల్లగొండ కలెక్టర్
డి. దివ్య: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
భారతి హోళికేరి: పురావస్తు శాఖ డైరెక్టర్
సంగీతా: సీఎంవో సంయుక్త కార్యదర్శి
మహేశ్ దత్ ఎక్కా: గనుల శాఖ ముఖ్య కార్యదర్శి
అహ్మద్ నజీర్: ప్రణాళిక ముఖ్య కార్యదర్శి
కాగా, ముఖ్యమంత్రి సెక్రటరీగా సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి జీ. చంద్రశేఖర్ రెడ్డి ని నియమించారు.
ప్రస్తుతం ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వీసీ & ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .