ఎఫ్ఎంసీ కంపెనీ రిజినల్ మార్కెటింగ్ మేనేజర్ మణిచందర్
కన్నూరులో రైతులకు అవగాహన సదస్సు
తెలంగాణఅక్షరం-కమలాపూర్
పంటల సస్యరక్షణకు చర్యలు చేపట్టాలని ఎఫ్ఎంసీ కంపెనీ రీజినల్ మార్కెటింగ్ మేనేజర్ మణిచందర్ అన్నారు. మండలంలోని కన్నూరు గ్రామంలో రైతులకు కంపెనీ ప్రతినిధులు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గులికలతో మెక్కలు ఏపుగా పెరుగుతాయని, పిలకలు ఎక్కువగా వచ్చి ధృడంగా పెరుగుతాయని చెప్పారు. అలాగే మొక్కలకు మొగిపరుగు, తెగుళ్లు, పోషకలోపాల వచ్చే వ్యాధులు, వాటి నివారణపై అవగాహన కల్పించారు. దీనికి కంపెనీకి చెందిన ఫెర్టెరా, కొరాజన్, జినాట్రా 700 ను వాడితే రైతులకు అధిక దిగుబడులు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు సురేంద్ర, రాము, కిరణ్, శ్రీను, రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.