నుజ్జు నజ్జాయిన కారు
పలువురికి గాయాలు..
వేములవాడకు వెళ్లి వస్తుండగా ఘటన
తెలంగాణ అక్షరం, హనుమకొండ క్రైమ్
గీసుగొండ పొలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళుతున్న లారీ కారు పైన పడింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. తీర్ధయాత్రల కోసం వేములవాడకు వెళ్లి వస్తున్న క్రమంలో లక్నపల్లి,రామారం గ్రామాల మధ్య నర్సంపేట రహదారి పై అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Please follow and like us: