కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి

  • ఎంపీ ఎన్నికలల్లో నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇస్తాం

  • పలు పార్టీల నుండి కాంగ్రెస్ లో 100 మంది చేరిక

  • కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఒడితల ప్రణవ్ బాబు

తెలంగాణఅక్షరం-వీణవంక

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే ఎన్నికలల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయడంతో పాటు భారీ మెజార్టీ ఇచ్చేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. మండలంలోని కోర్కల్ గ్రామంలో సుమారు 100మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి పలువురు కాంగ్రెస్ లో చేరారు. కాగా వారికి ఆయన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండ గా ఉంటానని, ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. పార్టీ అభివృద్ధిక ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ సంక్షేమ పథకాన్నిఅర్హులందరికీ అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి, కొమ్మిడి రాకేష్ రెడ్డి, ఎక్కటి రఘుపాల్ రెడ్డి, నల్ల కొండాల్ రెడ్డి, సాహెబ్ హుస్సెన్, అడిగొప్పుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *