తెలంగాణఅక్షరం-వీణవంక
ఆదిత్య సేవాభ్యుదయ ఆర్ఎంపీపీ ఎంపీ గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని కిష్ణంపేట గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు బొద్దుల సత్యనారాయణ (50) ఇటీవల అకాల మరణం చెందాడు. కాగా మండలంలోని గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల గ్రామీణ వైద్యులు కలిసి వారి ఇంటికి వెళ్లి మిత్రుని కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇందులో భాగంగా అందరూ గ్రామీణ వ్యక్తులు వారి సంఘం తరఫున రూ.26వేల 500 ఆర్థిక సాయం అందజేశారు. అలాగే వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్న మాధవుని నరసింహారాజు, జోనల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్ష డు కంకణాల శ్యాంసుందర్ రెడ్డి, మండల కార్యదర్శి మార్క అంజిబాబు, మండల కోశాధికారి గోపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.