జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్
హిమ్మత్ నగర్ లో పోలీసు కవాత్
తెలంగాణఅక్షరం-వీణవంక
లోక్ సభ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ సూచించారు. మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో సోమవారం సీఐఎస్ఎఫ్ బలగాలతో కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన రహదారుల్లో పోలీసు మార్చ్ నిర్వహించి అనంతరం గ్రామ కూడలి వద్ద గ్రామస్తులతో మాట్లాడారు. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీణవంక ఎస్సై తోట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: