మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత
తెలంగాణఅక్షరం- వీణవంక
వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మురహరి రాజమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల ప్రశాంత్, కాసనగొట్టు కర్ణాకర్,బోయిన విద్యాసాగర్,ఐలయ్య,బిక్షపతి,మొగిలి,సమ్మయ్య, చింటు తదితరులు పాల్గొన్నారు
Please follow and like us: