బిఆర్ఎస్ కు బిగ్ షాక్
హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ సమక్షంలో పార్టీ మారిన తిరుపతిరెడ్డి
తెలంగాణ అక్షరం-వీణవంక
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పర్యటన రోజున కాంగ్రెస్లోకి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వలస వెళ్లారు. తాజాగా నర్సింగపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో చేరిన తాజా మాజీ సర్పంచ్లకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపడటం ఖాయమని బిఆర్ఎస్ కనుమరుగవుతుందని,పార్లమెంట్ ఎన్నికల్లో వీణవంక మండలం నుండి కాంగ్రెస్కు అధిక శాతం ఓట్లు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.