తెలంగాణ అక్షరం-వీణవంక
ఈనెల 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓటర్లను మూడు రోజుల్లో జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు అందరికీ దేవుడని అందరం పూజిస్తామని కొందరు దేవుళ్ళ పేరుతో ఓట్లు అడగడం సరికాదని అన్నారు. అంతకుముందు గ్రామంలోని రామాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు ప్రణవ్ బాబును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి, మాసాడి మాధవరావు, తిరుమల్ రావు, సాహెబ్ హుస్సేన్, మేకల ఎల్లారెడ్డి, చిన్నాల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.