తెలంగాణ అక్షరం-హాసన్ పర్తి
స్థానిక మసీదు ఆవరణలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఈసరి రవీందర్ సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను, మధ్యాహ్న భోజనాన్ని, గ్రంథాలయ పుస్తకాలను వినియోగమును,పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. నూతనంగా వచ్చిన విద్యాశాఖ అధికారికి పిల్లలు స్వాగతం పలికారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎఫ్ ఎల్ ఎన్ అలైన్మెంట్ పాటించాలని, విద్యార్థులచే ప్రతిరోజు వర్క్ బుక్కులు రాయించాలని, గ్రంథాలయ పుస్తకాలు చదివించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, నేషనల్ అచీవ్ మెంట్ సర్వే- 2024 పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి, ఉపాధ్యాయులు దేవమ్మ, కురుమ పున్నంచందర్, రేవతి, సి ఆర్ పి రాజకుమార్, సర్దార్ కిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.