తెలంగాణ అక్షరం- హన్మకొండ
రెడ్డి కాలని లోని ఏకశిల కాన్సెప్ట్ స్కూల్ లో శుక్రవారం మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మట్టి విగ్రహాలని పూజించాలని,పర్యావరణానికి మేలు చేసే విధంగా గణపతి నవరాత్రులు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కృత్రిమమైన,విషపూరిత రసాయనాలతో కూడిన విగ్రహాలను పూజించడం పర్యావరణానికి చేటు చేయడమే అని పేర్కొన్నారు.పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని విద్యార్థులకు తెలియచేసా రు.విద్యార్థులు స్వయంగా మట్టి మరియు పిండి తో తయారు చేసిన విగ్రహాలను కాలని వాసులకు అందచేసారు.మట్టి విగ్రహాలని పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలి అంటూ అవగాహన ర్యాలి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వప్నారెడ్డి,ఉపాద్యాయులు జయ,శోభ,హరినాథ్,స్వామి,పవన్,విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.