యజమాని తుమ్మేటి మృతితో కుక్క కన్నీటి పర్యంతం
సమ్మిరెడ్డి చిత్రపటం వద్ద బోరున విలపిస్తున్న శునకం
తెలంగాణ అక్షరం-జమ్మికుంట
విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తుంది శునకం. తనకు అన్నం పెట్టి సాకిన యజమాని అంటే అమితమైన అభిమానం చూపిస్తుంది. ఆపద వస్తే ప్రాణాలకు తెగించి అండగా ఉంటుంది. అలాంటి స్వామి భక్తికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఘటన. తన యజమాని కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మేటి తమ్మి రెడ్డి ఇటీవల కాలం చేయడంతో నిద్రాహారాలు మరిచి అతడి చిత్రపటం వద్ద కన్నీళ్లు పెడుతూ కూర్చుంటున్నది ఒక శునకం. సొంత వారిని మించి తన ప్రేమను చూపుతున్నది.
Please follow and like us: