తెలంగాణ అక్షరం-హన్మకొండ
కొత్తవాడ వరంగల్ లోని ఏకశిలా జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి పిల్లలు , ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా, అందంగా బతుకమ్మలు పేర్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పండుగను చేసుకున్నారు. పిల్లలు భారత జాతి సంస్కృతిని, సంప్రదాయాన్ని చాటే విదంగా అందంగా దుస్తులు ధరించి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పూజిస్తూ ఆనందంగా గడిపారు. ఈ సందర్బంగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ శ్రీ గౌరు తిరుపతి రెడ్డి గారు పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది ఉమా, సుష్మ, స్వాతి, అనూష , విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని బతుకమ్మ సంబురాలు ఆకాశానంటే విధంగా ఆట పాటలతో ముగించారు.