నర్సంపేటలో కలకలం..
పేకాటాడుతూ పట్టుపడిన రాజకీయ నాయకులు.!
సర్వాపురంలోని ఓ ఇంటిలో ఆడుతుండగా పలువురిని పట్టుకున్న పోలీసులు
తెలంగాణఅక్షరం – నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని పలువురు ప్రముఖులు పేకాటాడుతూ ఆదివారం పట్టుబడ్డారు. పట్టణ ప్రముఖులు పేకాట ఆడి పట్టుబడ్డారన్న వార్త నర్సంపేట పట్టణంలో హల్చల్ చేస్తోంది. పట్టణంలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో నర్సంపేట పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నర్సంపేట పట్టణానికి చెందిన వివిధ పార్టీల ప్రముఖ నాయకులు ఉన్నారు. పట్టుబడిన వారిలో నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భర్త కోమండ్ల గోపాల్ రెడ్డి, బీజేపీ పట్టణ నాయకులు శీలం రాంబాబు, ముత్తోజి పేట మాజీ సర్పంచ్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాదిరెడ్డి సాగర్ రెడ్డి, చిలువేరు శ్రీనివాస్, పేరాల సమ్మారావు, నంద్యాల సురేష్ రెడ్డి, కోమండ్ల కరుణాకర్ రెడ్డి, వేనుముద్దల దేవేందర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి దగ్గర నుండి రూ. 33,360 ను సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.