సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్కొండ ప్రసాద్
తెలంగాణ అక్షరం-కరీంనగర్
సగర్ల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను సగర సంగం సంఘం జిల్లా అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్ కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన బీసీల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దేశంలో నిర్మాణ రంగంలో సగరుల పాత్ర కీలకమని సగరులను గుర్తించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థితిగతులను కమిటీ ఎదుట ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి, రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదల అయ్యేవిధంగా వారిని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తమ కుల సగరుల పరిస్థితులను గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా తమకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి బీసీ కమిషన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రమేల సత్పతి తో పాటు ఎమ్మెల్యేలు రాష్ట్ర జిల్లా అధికారులు, బిసి కులాలు నాయకులు సగర సంఘం జిల్లా, రాష్ట్ర నాయకులు కానిగంటి శ్రీనివాస్, దేవునూరి శ్రీనివాస్ బొడిపల్లి కోటేష్, తదితరులు పాల్గొన్నారు.