( పెండ్యాల రామ్ కుమార్, మంథని ) :
అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతినీలలోహిత వికిరణాలును ఓజోన్ పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్ ప్రొటోకాల్ (ఓజోన్ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987, సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. ఆ తరువాత 1994, సెప్టెంబర్ 16న మరో సమావేశం జరిపి, ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు. దాంతో ప్రతి సంవత్సం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడింది. పర్యావరణ మార్పులపై, ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించడం.అన్ని దేశాల ప్రభుత్వాలు మాంత్రియల్ ప్రొటోకాల్‌ను మరింత సమర్థంగా అమలుచేసి 2050 సంవత్సరానికి ఓజోన్ పొరను 1980కు ముందున్నస్థాయికి తేవడం,అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయడం,మొక్కలను పెంచడం,యంత్రాల నుంచి వినాశకర వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమలు రక్షణ చర్యలు చేపట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు.
నేడు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
Please follow and like us: