వీణవంక మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి
తెలంగాణ అక్షరం-వీణవంక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిర్వహించతలపెట్టిన దీక్షా దివాస్ కార్యక్రామాన్ని విజయవంతం చేయాలని వీణవంక మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ అక్షరంతో వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కరీంనగర్ జిల్లా కీలకంగా వ్యవహరించిందని, మాజీ సీఎం కేసీఆర్ ను అలుగునూరులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని గుర్తు చేశారు. దీనికి గుర్తుగా రాష్ట్రమంతటా దీక్షా దివాస్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కావున బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.