తెలంగాణఅక్షరం-వీణవంక
ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలల్లో మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పోతరవేన సతీష్ కుమార్ మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా సతీష్ ను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదివారం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మండలంలోని యువతను పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు యువతను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే మండలంలోని లస్మక్కపల్లి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించేలా కృషి చేయాలని ప్రణవ్ ను ఆ గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్,ఉపాధ్యక్షులు ధర్మముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.