సంగీత ప్రపంచానికి మహారాణి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి

( పెండ్యాల రామ్ కుమార్, మంథని )

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా ఎన్నో అవార్డులను ఎంఎస్ సుబ్బులక్ష్మి సొంతం చేసుకున్నారు. టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా ఆమె సేవలందించారు. తెలుగు నేలపై ప్రముఖంగా వినిపించే వేంకటేశ్వర సుప్రభాతం పాడింది కూడా ఆమే.కర్ణాటక సంగీత విద్వాంసురాలు మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి సెప్టెంబరు 16, 1916న తమిళనాడులోని మదురైలో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య అయ్యర్, షణ్మఖవడివేర్. ఆమె నానమ్మ అక్కమ్మాళ్ వయొలిన్ విద్వాంసురాలు.చాలా చిన్నవయసులోనే సుబ్బులక్ష్మి సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద కర్ణాటక సంగీతాన్ని, పండిట్ నారాయణరావ్ వ్యాస్‌ శిక్షణలో హిందుస్థానీ సంగీతాన్ని సాధన చేశారు.భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి సంగీత విద్వాంసురాలు సుబ్బులక్ష్మి. అంతేకాదు, ఆసియా నోబెల్ బహుమతిగా చెప్పుకునే రామన్ మెగసేసే అవార్డు పొందిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలు కూడా.17 సంవత్సరాలకే సొంతంగా ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు సుబ్బులక్ష్మి. భారత దేశ సాంస్కృతిక రాయబారిగా లండన్, న్యూయార్క్, కెనడా వంటి దేశాల్లో కూడా సంగీత ప్రదర్శనలిచ్చారు.1927లో తన 11ఏళ్ల వయసులో సుబ్బులక్ష్మి తిరుచిరాపల్లిలో తొలి ప్రదర్శన ఇచ్చారు. దీన్ని తిరుచిరాపల్లికి చెందిన కాంగ్రెస్ నేత నటేశ అయ్యర్ ఏర్పాటు చేశారు.1936లో సుబ్బులక్ష్మి మద్రాసుకు చేరారు. 1938లో సేవాసదన్ అనే సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా సుబ్బులక్ష్మి సేవలందించారు. 2004 డిసెంబరు 11న చెన్నైలో మరణించారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *