ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ గర్జన విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర కోశాధికారి శ్రీ వడ్లకొండ కుమారస్వామి సగర పిలుపు
తెలంగాణ అక్షరం-భూపాలపల్లి
హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధభేరికి సగరులందరూ పెద్ద ఎత్తున తరలిరవాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం బీసీ రాజకీయ యుద్ధభేరి వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా, ఆర్థికంగా సగరులు ఎదగాలని సూచించారు. బీసీల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన సదస్సును విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కదలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు దేవునూరి చంద్రమౌళి సగర, సగర సంఘం నాయకులు ఎంజాల రమేష్ సగర, ఎంజాల మల్లేశం సగర, ఆసం స్వామి సగర, ఎంజాల శ్రీనివాస్ సగర, కానుగంటి రవి సగర, ఆసం లక్ష్మి సగర తదితరులు పాల్గొన్నారు.