బీఆర్ఎస్ వీ రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ
తెలంగాణఅక్షరం-వీణవంక
తెలంగాణ రాష్ట్రంలోని అసమర్థ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని బీఆర్ఎస్ వీ రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ కోరారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మండలంలోని కొండపాక గ్రామంలో గాంధీ గారికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ వర్మ మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం అబద్ధాలను ప్రచారం చేసి నెరవేరని హామీలను నెరవేరుస్తామని చెప్పి 420 హామీలు ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తూ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తానని చెప్పి నేటికీ 420 రోజులు అయినప్పటికీ హామీలను పూర్తి చేయని అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేతగాని కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి ప్రసాదించుమని గాంధీకి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నకిలీ గాంధీలు ఇచ్చిన 420 హామీలు నేడు రేవంత్ రెడ్డి ఎగవేతల పానులకు 420 రోజులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇస్తానన్న 420 హామీలను ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ప్రీయంబర్స్మెంట్ను విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదో తరగతి పూర్తి చేస్తే 10000 ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే 15,000 డిగ్రీ పూర్తి చేస్తే25,000 పీజీ పూర్తి చేస్తే లక్ష రూపాయలని మాయ మాటలు చెప్పి మహిళలకు స్కూటీలని ఇలా ఎన్నో నెరవేరని హామీలను ఆశ చూపి ప్రజలను పథకాల పేరుతో మభ్యపెడుతూ కాలం కాలం గడుపుతూ 26వ తారీకు నాలుగు పథకాలను బాటాలతో అమలు చేస్తానని చెప్పి ఇలా చెప్పి అలా ఎలక్షన్ కోడ్ ను విధించిన గుంపు మేస్త్రి ఇప్పటికైనా ప్రజలు మేలుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా తిరగబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండపాక మాజీ సర్పంచ్ ఆవాల అరుందతిగిరిబాబు, మాజీ ఉప సర్పంచ్ రాజకుమార్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు భూమయ్య, కాసర్ల సుధాకర్, మెడగొని శ్రీనివాస్, గట్టు మధు మొగిలి ,రాజు, రాపర్తి శ్రీను టిఆర్ఎస్వి నియోజకవర్గ సీనియర్ నాయకులు వోల్లాల శ్రీకాంత్ గౌడ్, రాపర్తి అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.