తెలంగాణ అక్షరం -కుత్బుల్లాపూర్ టౌన్
పదో తరగతి విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఒత్తిడికి గురి కాకుండా పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని మాజీ ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు కూన రాఘవేందర్ గౌడ్ తెలిపారు. పట్టుదలతో చదివిన అంశాలను ఒత్తిడికి గురికాకుండా కాగితంపై విశధికరిస్తే ఉత్తమ ఫలితం సాధిస్తారని పేర్కొన్నారు. పరీక్షలు అనగానే లోలోపల భయపడకుండా ప్రశాంతమైన మనసుతో రాయడమే విజయానికి నాంది అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, గురువులు ఆశయాల అనుగుణంగా రాణించేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. చదువు ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని, విద్యార్థులు ఏకాగ్రతతో చదవి మంచి మార్కులు సాధించాలన్నారు. పరీక్ష కేంద్రానికి అర్థగంట ముందుగా వెళ్లి పరీక్ష కేంద్రానికి అర్థగంట ముందుగా వెళ్లి సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రశ్నలను సమగ్రంగా అర్థం చేసుకుని ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని అన్నారు.