తెలంగాణఅక్షరం-ఆత్మకూరు
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లి గ్రామంలో ఒరిస్సా రాష్ర్టానికి చెందిన సెంచూరియన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు గ్రామాల్లో వ్యవసాయం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు రకాల పంటలను విశ్వ విద్యాలయ ప్రొపెసర్లు అశోక్, హర్షవర్ధన్ ల పర్యవేక్షణలో విద్యార్థులు మెండె అంజలి, మెండె ప్రీతి, మందగిరి వరలక్ష్మిపరిశీలించారు.
ప్రస్తుత పంటల సస్యరక్షణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో సేంద్రీయ వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. అలాగే సేంద్రీయ వ్యవసాయ విధానమే మేలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని సూచించారు.
Please follow and like us: