తెలంగాణ అక్షరం-కరీంనగర్
ఎప్‌సెట్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోగల కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. తమ విద్యా సంస్థల్లోని విద్యార్థులు 405, 430, 560, 697, 730, 760, 791, 859, 934,1104, 1166, 1546, 1619, 1795, 1950 ర్యాంకులతో పాటు మొత్తం 89 మందికి పైగా విద్యార్థులు 10 వేలలోపు ర్యాంకులు సాధించారని చెప్పారు. ట్రినిటీ జూనియర్ కళాశాలలు పోటీ పరీక్షల్లో ఏటా అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తూ విద్యా రంగంలో తమ ప్రత్యేకతను చాటుతున్నాయని తెలిపారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్, ఎప్‌సెట్ పోటీ పరీక్షల బోధనలో అనుభవం, నైపుణ్యం కలిగిన అధ్యాపకుల శిక్షణ, అంకిత భావం కలిగి, నిరంతరం కృషి చేయడం ద్వారానే ఈ ర్యాంకులు సాధ్యమయ్యాయన్నారు. ఈ ఫలితాలు కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన కళాశాలల్లోవి మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి విద్యార్థులను అభినందిస్తూ, ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు.

ఎప్‌సెట్ -2025లో ట్రినిటీ విద్యార్థుల విజయభేరి
Please follow and like us: