తెలంగాణఅక్షరం-వీణవంక
Strict action | ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శిక్షణ ఎస్సై సాయికృష్ణ విత్తన డీలర్లను హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపుల యజమానులతో ఏఓ గణేష్ తో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మకూడదని, గుర్తుతెలియని వ్యక్తులకు పురుగుమందులు, క్రిమినాశకాలు అమ్మకూడదని సూచించారు.
పురుగు మందులు అమ్మేటపుడు రైతు ఆధార్ కార్డు, పాస్ బుక్ జీరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. సరైన లైసెన్సు ఉన్నవారే అమ్మకాలు జరపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో ప్రకాష్‌రెడ్డి, ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.