తెలంగాణఅక్షరం-హుజురాబాద్
హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామ గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కేశ బోయిన ఓదెలు ప్రధాన కార్యదర్శిగా కేశ బోయిన అశోక్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా కేశవైన లింగయ్య ఎన్నికయ్యారు.
అలాగే డైరెక్టర్లుగా నాని, రమేష్, మేడుదుల రాజు, కేశ బోయిన కేతమ్మ, గుంపుల రాజమ్మ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు సాయంత్రం ప్రకటించారు. కాగా నూతనంగా ఎన్నికైన సంఘం నాయకులను సంఘ సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
Please follow and like us: