వీణవంక, మే 24:మండల కేంద్రంలో దళిత బంధు సాధన సమితి నాయకులను పోలీసులు శనివారం ముందస్తు అరెస్ట్ చేశారు. దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ శనివారం హుజురాబాద్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు కు పిలుపునీయగా పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు నాయకులు తెలిపారు.అక్రమ అరెస్టు సరైన పద్ధతి కాదని, వెంటనే దళిత బంధు రెండో విడుత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో దళిత బంధు సాధన సమితి మండల ఇంచార్జి లు మహంకాళి రమేష్, సాగంటి స్వామి, వూట్ల సంపత్, పుల్లూరి సంపత్, దాసారపు నాగరాజు ఉన్నారు.
Please follow and like us: