Mining Engineering 1st Rank | రామగిరి మే 26: ఉన్నత విద్యా మండలి ప్రకటించిన ఈసెట్ 2025 ఫలితాల్లో మైనింగ్ విభాగంలో రాష్ట స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన కుర్మ అక్షయ సగరను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ శ్రీ కోయ హర్ష, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సోమవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని కష్టపడి చదవాలని సూచించారు. ఉన్నత విద్య చదివేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కురుమ అనిల్ కుమార్ సగర ఒక సాధారణ మేస్త్రి కుటుంబానికి చెందిన తమ బిడ్డను ఉన్నత విద్యావంతురాలిగా తీర్చిదిద్దుతూ, రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించేటట్లు చేయడం గ్రామానికి, మండలానికి, జిల్లాకి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని అభినందించారు.
భవిష్యత్తులో అక్షయ ఉన్నత శిఖరాలను అధిరోహించి, గ్రామానికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.