తెలంగాణఅక్షరం-వీణవంక
వీణవంక మండల కేంద్రంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం లగ్గ బోనాలు, నాగవల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. గొల్ల, కురుమ కులస్తులు మహిళలు బోనాలతో రాగా బీరన్న పూజారుల ఒగ్గు డప్పు చప్పుళ్ళుతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీరన్న పూజారులు గొర్రె పిల్లను గావు పట్టారు. బోనాల చుట్టూ తిరిగే కార్యక్రమం జనం ఎంతో ఆసక్తిగా చూశారు. అనంతరం బోనాలతో దేవాలయానికి చేరుకొని నైవేధ్యం పెట్టి మొక్కలు చెల్లించుకున్నారు.
అనంతరం కామరతి బీరన్న ఉత్సవ మూర్తుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాగా ఈ ఉత్సవాలకు ఆలయ భూదాత పాడి సాయినాథ్ రెడ్డి కుటుంబీకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ నీల మొండయ్య, వైస్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, మాజీ సర్పంచులు చిన్నాల ఐలయ్య యాదవ్, నీల కుమారస్వామి, కుల పెద్దలు నీల కుమార్, మర్రి రవీందర్, నీల ఎల్లయ్య, కంకల రాయమల్లు, నీల ఓదెలు, నీల రాజయ్య, కొమురయ్య, కొలుపుల సదయ్య, దాడ సమ్మయ్య, గెల్లు సమ్మయ్య, ముష్క ఐలయ్య, తొట్ల మల్లయ్య, దాడ శ్రీనివాస్, సదయ్య తదితరులు పాల్గొన్నారు.