- హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు
తెలంగాణఅక్షరం-హుజురాబాద్
నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని హై స్కూల్ మైదానంలో వాకర్స్ కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పది లక్షల విలువ చేసే వాకింగ్ ట్రాక్, గేట్ పనులను ఆయన శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏళ్లుగా ఎదురుచూస్తున్న పనులకు మోక్షం లభిస్తుందని, కాంగ్రెస్ అన్నారు. ముఖ్యమంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రుల సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని, 10నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ప్రారంభించామన్నారు. రాజకీయాలకు అతీతంగా హుజురాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, హనుమాన్ దేవాలయ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ అధ్యక్షుడు, మైనారిటీ, సేవాదళ్ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.