భౌగోళికంగా తెలంగాణ సాధించాం..
అమరుల ఆశయాల తెలంగాణ ఇంకా కలగానే ఉంది – పెద్దబుద్దుల సతీష్ సాగర్
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని కొంపల్లి మున్సిపల్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అద్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ముఖ్య అతిధి, జిల్లా ఉపాధ్యక్షులు రాజి రెడ్డి మాట్లాడుతూ అనేక మంది త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అమరుల కుటుంబాలకు సరైన గుర్తింపు గుర్తింపు లేదని, ప్రభుత్వం అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మాట ఇచ్చి మోసం చేసింది అని తెలిపారు. కొంపల్లి బీజేపీ అధ్యక్షులు సతీష్ సాగర్ మాట్లాడుతూ, స్వరాష్ట్ర సాధనలో గల్లి నుండి డిల్లీ వరకు కొనసాగిన ఉద్యమంలో బీజేపీ కీలకంగా వ్యవహరించిందని, భౌగోళికంగా తెలంగాణ సాధించాం కాని అమరుల ఆశయాల తెలంగాణ ఇంకా కలగానే ఉందని, అది కేవలం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి, అసెంబ్లీ కోకన్వినర్ శివాజీరాజు, బీజేపీ జిల్లా నాయకులు దుర్గఅశోక్, శంకర్ నాయక్, కొంపల్లి బీజేపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి, మధు, శ్రీకాంత్ రెడ్డి, మహేందర్, తిరుపతి, శ్రీకాంత్, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Please follow and like us: