రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 న BMS ధర్నా

  • BMS కార్యకర్తలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్ పిలుపు

తెలంగాణఅక్షరం-కరీంనగర్‌

ప్రజాస్వామ్యంలో కార్మికుల యొక్క హక్కులను కాల రాస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కి నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు BMS రాష్ర్ట ఉపాధ్యక్షుడు పప్పుల సురేష్‌ తెలిపారు.

ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసన తెలపడంతో కలెక్టర్ ద్వారా సీఎంకు మెమోరాండం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని , కావున జిల్లా నాయకులు కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పప్పుల సురేష్ పిలుపునిచ్చారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *