తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ కల్వ సుజాత , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి,జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ హాజరై ప్రసంగించారు.ఈ సందర్బంగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అధ్యక్షునిగా వాస శ్రీనివాసులు గుప్త, కార్యదర్శిగా దారం ఇంద్రసేన గుప్త, కోశాధికారిగా సోమిశెట్టి పవన్ కుమార్ గుప్త,వర్కింగ్ ప్రెసిడెంట్గా తెరల శ్రీనివాస్ గుప్త, ఉపాధ్యక్షులు, సలహాదారులు సహా కార్యదర్శులు, సహా కోశాధికారులు,కమిటీ సభ్యులు స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు బెల్దే రమేష్ ,పార్శి ప్రకాష్ గుప్తా ,అముర ఇంద్రసేన గుప్త జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, సూరారం, గాజులరామారం, చింతల్, సుచిత్ర, సుభాష్ నగర్ ఆర్యవైశ్య సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం
Please follow and like us: