పూర్వ విద్యార్థుల ఔదార్యం… ఏవివి పాఠశాల అభివృద్ధికి విరాళం

తెలంగాణ అక్షరం- వరంగల్:

వరంగల్ లోని ఏవివి పాఠశాలలో 2002-03కు చెందిన విద్యార్థులు ఇటీవల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కొరకు తమ వంతు సాయం అందజేస్తామని పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం రోజు ప్రధానాచార్యులు , ఉపాధ్యాయుల సమక్షంలో పాఠశాల అభివృద్ధి కొరకు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మాట్లాడుతూ విద్యార్థుల సద్భావన పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, పూర్వ విద్యార్థుల ఔదార్యం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు .పాఠశాల కరస్పాండెంట్,ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *