- వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరిక
తెలంగాణఅక్షరం-వీణవంక
మానేరు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరించారు. మండల పరిధిలోని కొండపాక, చల్లూరు గ్రామాల్లో మానేరు తీరం నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్లూరు చెందిన దామెర నర్సయ్య, కొండపాకకు చెందిన సల్పల సమ్మయ్య ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Please follow and like us: