తెలంగాణ అక్షరం – హుజురాబాద్:
21 ఏళ్ల క్రితం విడిపోయిన మిత్రులు ఒకసారిగా అంతా ఒకే వేదికపై కలవడంతో వారి భావోద్వేగాలకు అంతులేకుండా పోయింది. హుజురాబాద్ పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో కాకతీయ పాఠశాలలో 2003-04 లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ ఆదివారం వేడుకలు కలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూస్తూ ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
ఈ సమ్మేళనంలో విద్యార్థులకు పాఠాలు నేర్పిన గురువులు సైతం కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సుమారుగా 21 సంవత్సరాల తర్వాత ఒకరినొకరిని కలుసుకొని వారి తీపి గుర్తులతో కాలక్షేపం చేస్తూఆనందంగా గడిపారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉపాధ్యాయులు రాజయ్య ప్రతాపరెడ్డి, వేణుగోపాల్, సదిరెడ్డి, అజ్మత్ అలీ, పున్నం చందర్ లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.