– బీజేపీ పట్టణ అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలలో ఉన్నటువంటి డ్రైనేజీ,రోడ్డు సమస్యలను పరిష్కరించాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కొంపల్లి బిజెపి పట్టణ నాయకులు , పట్టణ అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అవని గార్డెన్ డ్రైనేజీ, పోచంపల్లి రోడ్డు లోని అపర్ణ పామ్ గ్రూవ్ నుండి రాయల్ పార్క్ వరకు రోడ్డు, దూలపల్లి, జయభేరి , ఎన్.సి.ఎల్ కాలనీలోని పలు సమస్యలను కమిషనర్ కి వివరించారు. వర్షాకాలంలో ఈ సమస్యల తీవ్రత అధికంగా ఉందని, కాలనీల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. ఈ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరిత రావు, అసెంబ్లీ కోకన్వినర్ శివాజీ రాజు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బూర్గుబావి అశోక్, కొంపల్లి మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్, కోశాధికారి ఉప్పరి మహేందర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

కొంపల్లి మున్సిపాలిటీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
Please follow and like us: