తెలంగాణఅక్షరం-వీణవంక
వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు మద్దుల ప్రశాంత్ పటేల్, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరిక మేరకు సోమవారం సోలార్ సీసీ కెమెరాను అందజేశారు. ఈ సందర్భంగా మద్దుల ప్రశాంత్ పటేల్ మాట్లాడారు. నేర పరిశోధన విభాగంలో ప్రముఖ పాత్ర వహించేవి సీసీ కెమెరాలను, గ్రామ గ్రామాన అనుకోని ప్రమాదాలు, దొంగతనాలు, కొట్లాటలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ప్రమాదాలను ఎప్పటికప్పుడు నివారించవ్చని తెలిపారు.
దొంగలను పట్టుకునేందుకు, నిఘా నేత్రాలు, ప్రజలకు రక్షణ కవచాలుగా పనిచేస్తూ, ప్రముఖ పాత్ర వహిస్తాయని, పోలీసులకు నిఘా నేత్రాలు నేర పరిశోధనలో సహకరిస్తాయని, అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం చేయకుతుందన్నారు. సోలార్ సీసీ కెమెరా అందజేసిన మద్దుల ప్రశాంత్ పటేల్ కు ఎస్సై ఆవుల తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అజయ్ తదితరులు పాల్గొన్నారు.