పార్కు స్థలాల కబ్జాపై బిజెపి కన్నేర్ర….

ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలే కబ్జాదారులు….?
మాయమవుతున్న పార్కు స్థలాలను పరిరక్షించాలి….
రిలే నిరాహార దీక్షలో ‘అందెల’

తెలంగాణ అక్షరం- బాలాపూర్ :

బాలాపూర్ మండలం బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పార్కు స్థలాలు కబ్జా అవుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో పాటు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని భారతీయ జనతా పార్టీ కన్నేర్ర చేసింది. బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణ రెడ్డిల ఆధ్వర్యంలో అన్యాక్రాంతం అవుతున్న పార్కు స్థలాలను పరిరక్షించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు, రంగారెడ్డి రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నరసింహా రెడ్డిలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు కలిసి కార్పొరేషన్ ను అవినీతిలో ముంచారని మండిపడ్డారు. కార్పొరేషన్ లో కొన్ని వేల గజాల పార్కు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని, దీనిపై భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఇరు పార్టీలు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కబ్జాలకు గురైన పార్క్ స్థలాలను వెంటనే కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకొని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని శ్రీరాములు హెచ్చరించారు. రిలే దీక్ష చేపట్టిన నాయకులకు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు పాపయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు కొలన్ శంకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తర్రే మల్లేష్ యాదవ్, మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఓబిసి మోర్చా నాయకులు నడి కుడ యాదగిరి, ఏనుగు ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దడిగ శంకర్, మాజీ కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ గడ్డం లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఏనుగు రామిరెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్ పేతుల పుల్లారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు నవారు శ్రీనివాస్ రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రేసు నరసింహారెడ్డి, పాలు బాయ్ లక్ష్మణ్, నిమ్మల రవికాంత్ గౌడ్, శశివర్ధన్ రెడ్డి, సైదులు, రాంబాబు గౌడ్, రాష్ట్ర ఓబిసి మూర్చ నాయకులు లాలా సందీప్, రవి గౌడ్, కుంటి భాస్కర్, మంత్రి మహేష్, సాయి సంతోష్, కొండల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *