తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
గాజులరామారంలోని వాసవి మాత ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వేడుకలలో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పండ్లు కూరగాయలతో శోభాయమానంగా అలంకరించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత అయిన వాసవి మాత భక్తులకు శాకాంబరి రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలలో ఆర్యవైశ్య సంఘ నాయకులు అన్నదాన అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల సందడితో అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు.
Please follow and like us: