అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు

తెలంగాణ అక్షరం- కుత్బుల్లాపూర్ :

కుత్బుల్లాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేకంగా అలంకరించుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామ వీధులన్నీ బోనాల ఊరేగింపులతో మారుమ్రోగాయి. తాళం, డప్పులతో, పల్లకీతో అమ్మవారిని ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలు గ్రామ ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక విలువల పరిరక్షణకు ప్రతీకగా నిలిచాయి. గ్రామస్థుల సహకారంతో ఎంతో సాంప్రదాయబద్ధంగా, శ్రద్ధతో బోనాల ఉత్సవం నిర్వహించడాన్ని అందరూ ప్రశంసించారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *