- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కల పంపిణి లో పాల్గొన్న కౌశిక్ రెడ్డి దంపతులు
తెలంగాణ అక్షరం-హుజురాబాద్
కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా వివాహం చేసుకున్న వారికి ఇస్తానన్న తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కుటుంబాల పెళ్లిళ్ల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం చాలామంది జీవితాల్లో ఆసరా అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా కళ్యాణ లక్ష్మి పేరిట లక్ష రూపాయల తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వము వచ్చిన తర్వాత వేల పెళ్లిళ్లు జరిగాయని వారందరికీ తులం బంగారం ఎప్పుడు ఇస్తారు చెప్పాలన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అర్హులందరికీ పంపిణీ చేశారు. ఇల్లంతకుంట 34 కళ్యాణ లక్ష్మి చెక్కులు హుజురాబాద్ టౌన్ 19 చెక్కులు సుమారు 53 లక్షల 6వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు అలాగే కమలాపూర్ కి 12 లక్షల విలువగల 49 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతోపాటు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.