తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి , దూలపల్లి ప్రాంతాలలో ఉన్న స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాజిరెడ్డి, శివాజీ రాజు, సరిత రావు , సతీష్ మాట్లాడుతూ స్మశాన వాటికలో కనీస అవసరాల లేని కారణంగా ఎవరైనా చనిపోతే అంతక్రియలు చేయడానికి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలు బొల్లారం, అల్వాల్ ప్రాంతాలలో ఉన్న వైకుంఠధామాలకు పార్థివ దేహాలను తీసుక వెళ్లి అంత్యక్రియలు చేస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ద నిర్వహణ లేకపోవడం, వీధి దీపాల సమస్యలు, నిర్మించిన మరుగుదొడ్లు నిర్వహణ లేకపోవడం, శవ దహనకోసం నిర్మించిన నిర్మాణాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు పోసి నిరుపయోగంగా చేయడం, అనేక సంవత్సరాల నుండి దూలపల్లిలో మరుగుదొడ్లు నిర్మించకపోవడం, ఉన్న వాటిని వాడుకలోకి తీసుకురాకపోవడం ఇలాంటి అనేకరకాలైన కారణాలు ఇక్కడి శ్మశాన వాటికలో తాండవిస్తున్నాయని పేర్కొన్నారు. వైకుంఠధామాల మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ తరుపున అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళిన ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు.ఈ ధర్నా కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బూర్గుబావి అశోక్, సీనియర్ నాయకులు నరసింహ, చక్రధర్, కొంపల్లి పట్టణ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గోన్నారు.

స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
Please follow and like us: