తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:
సమస్యలు పరిష్కరించాలని ‘సేవ్ హైదరాబాద్’ పేరుతో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ బిజెపి నాయకులు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచే నగరంలోని బిజెపి నాయకులను కార్యకర్తలను, కార్పోరేటర్లను గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని సచివాలయం ముట్టడికి కొంపల్లి బిజెపి నాయకులు తరలి వెళ్లారు. సెక్రటేరియట్ గేట్ల వద్దకు చేరుకున్న కొంపల్లి బిజెపి నాయకులను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఇంచార్జి అధ్యక్షులు డా.మల్లారెడ్డి, మహిళా అధ్యకులు శిల్ప రెడ్డి, అధికార ప్రతినిధి సరిత రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేష్ , కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కోకన్వినర్ శివాజీ రాజు, కొంపల్లి అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్, కోశాధికారి మహేందర్ సాగర్ తదితరులు ఉన్నారు.

ఛలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొన్న కొంపల్లి బీజేపీ నాయకులు
Please follow and like us: