తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుని ప్రతిమలను పూజించాలని కార్పొరేటర్ రావుల శేషగిరి ప్రజలకు పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ వార్డ్ కార్యాలయంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ రక్షణ కొరకై మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, మురళీకృష్ణ ,వీరాచారి ,జగదీష్ రెడ్డి ,జిహెచ్ఎంసి పాండు,కాలనీవాసులు, సిబ్బందిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

మట్టి వినాయకులను పూజిద్దాం
Please follow and like us: