తెలంగాణఅక్షరం-వీణవంక
వర్గీకరణ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో ఆ సంఘం నూతన కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బంధు అమలుతో పాటు నామినేటెడ్ పోస్టులల్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల గౌరవ అధ్యక్షుడిగా రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నర్సయ్య, బొబ్బిలి ప్రేమానందం, సలహాదారుడిగా సమిళ్ల బాబురావు, మండల అధ్యక్షుడిగా కర్నె నర్సయ్య, ఉపాధ్యక్షులుగా సమిండ్ల చిట్టి, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల శ్రీనివాస్, కోశాధికారిగా శ్రీరాం ఐలయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా జానపట్ల ఉదయ్, తో పలువురి సభ్యులను ఎన్నుకున్నారు. అలాగే మహిళా విభాగం కన్వీనర్లుగా దర్శనాల కమల, ఓరెం సుమతి, ముద్దమల్ల హైమ, యువజన విభాగం కన్వినర్లుగా ముద్దమల్ల విజయ్, పోతుల అజయ్, బోగం శ్రీజన్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శ పోతుల సురేష్, హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు చింతల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నీరటి శ్రీనివాస్, నాయకులు నీరటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.