తెలంగాణఅక్షరం-వీణవంక
సంస్కృతిక సంస్థల కళాకారుల మండల కమిటీని ఆ సంఘం హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు తాండ్ర శంకర్ అధ్యక్షతన ఆదివారం ఎన్నకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ అంతరించిపోతున్న కళా వైభోగాలను చక్కగా ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్య వంతం చేయడంలో ఆనాటి కళాకారులు ముందడుగు ఉండేవారని అన్నారు. ప్రస్తుతం కళాకారులకు ప్రోత్సాహం లేక కళలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్ చేశారు. అంతేకాకుండా ప్రోత్సాహం లేకుండా ఉండడంతో వారి మనుగడ కరువవుతుందని వాపోయారు. ప్రస్తుతం కళలను ప్రోత్సహించేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని, ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా పెద్ది నారాయణరెడ్డి, అధ్యక్షుడిగా గడ్డం నారాయణ (చల్లూర్), ప్రధాన కార్యదర్శిగా గోనెల సమ్మయ్య మల్లారెడ్డిపల్లి, ఉపాధ్యక్షులుగా అల్లపురెడ్డి దేవేందర్ రెడ్డి (కనపర్తి), కోట రమణారెడ్డి, ఊకంటి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా దాసారపు రాజు, ఇరవేణి రవీందర్, కోశాధికారిగా కళ్లెపు దేవేందర్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా యాసర్ల ఓదెలు, భిక్షపతి, కార్యవర్గ సభ్యులను ఎన్నకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ, శంకరపట్నం, మానకొండూరు మండల కమిటీల అధ్యక్షులు పాల్గొన్నారు.