పాల్గొన్న ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి
తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని దేశాయిపల్లిలో ఎంపీపీ ముసిపట్ల రేణుక – తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గోవిందా కళ్యాణ మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. దేశాయిపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో ఆశేష భక్తజనం మధ్య, వేదపండితుల మంత్రోచ్చరణలతో గోవింద కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. తీరొక్క పూలు, పండ్లు, నైవేద్యాలు, స్వామి వారికి సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ : ప్రజలు, గొడ్డుగోద, పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని గోవిందా స్వామి వారి కళ్యాణం జరిపించడం జరుగుతుందని అన్నారు. ఆధ్యాత్మిక జీవనంతోనే ప్రతీ ఒక్కరికి ప్రశాంతమైన జీవితం లభిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలకు పూర్వవైభవం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాకాల సత్యనారాయణరెడ్డి, గ్రామస్తులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.